ఇది నా all time favourite సినిమా. ఖాళీ దొరికినపుడల్లా చూస్తుంటాను. When I was watching it last time ఒక చిన్న తప్పు కనిపించింది. రాక్షసులకు నోరుతిరగక, గురువుగారు "భక్షిస్తాం" అనమంటె "బకిసిత్తాం, బకిసిత్తాం" అంటారు. కానీ ఘటోత్కచుడు, మొదట రథం చప్పుడు విన్నపుడు ఒక రాక్షసుడిని పంపిస్తాడు. వాడు అభిమన్యుడి దారికి అడ్డంగా గోడలా మారి నిలుచుంటాడు. ఆ గోడను అభిమన్యుడు బాణంతో ఛేదిస్తాడు. అప్పుడు ఆ రాక్షసుడు పొట్టలో బాణంతో ఘటోత్కచుని ముందుకు వస్తాడు 'హతోస్మి హతోస్మి ' అంటూ..కానీ వాడికి నోరు తిరగదుకదా, వాడు 'హతోస్మి ' అని అంత చక్కగా ఎలా పలకగలిగాడు? 'అతసమీ అతసమీ ' అనాలిగదా?
Wednesday, 4 December 2013
Subscribe to:
Posts (Atom)